Gongura Chicken Biryani Recipe…గోంగూర చికెన్ బిర్యానీ

తెలుగు ప్రజల వంటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా గోంగూరతో చేసే ఏ వంటలైనా భోజన ప్రియులను ఇట్టే ఆకర్షిస్తాయి. అయితే మనం ఈరోజు నోరూరించే గోంగూర చికెన్ బిర్యానీ తయారీ గురించి తెలుసుకుందాం. ఈ టేస్టీ గోంగూర చికెన్ బిర్యానీని ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ తినాలి అనుకుంటారు.

కావాల్సిన పదార్థాలు
చికెన్ – 1KG
రిఫైన్డ్ ఆయిల్ – తగినంత
ఉల్లిపాయలు – 3 పెద్దవి (తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 50 గ్రాములు
గోంగూర ఆకుల పేస్ట్ – పావు కేజీ (ఉడికించి పేస్ట్ చేసుకోవాలి)
నీరు – తగినంత
కారం – 4 టీ స్పూన్లు
పసుపు – 3 టీ స్పూన్లు

బిర్యానీ బియ్యం కోసం..
బాస్మతి రైస్ – 1KG (85% వరకు ఉడికించండి)
దేశీ నెయ్యి – 60 గ్రాములు
కుంకుమపువ్వు – కొంచెం
పచ్చిమిర్చి – 6 కాయలు
పుదీనా ఆకులు – 10 రెబ్బలు
కొత్తిమీర – 4 టీస్పూన్స్
ఉప్పు – తగినంత

తయారీ విధానం: ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకోని కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకోని కేజీ చికెన్ కడిగి దానిలో తగినంత ఉప్పు, పసుపు, కరం కలుపుకొని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత పొయ్యి మీద గిన్నె పెట్టి కడిగిన గోంగూర దానిలో వేసుకొని, ఒక టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ కారం, పది పచ్చి మిరపకాయలు కట్ చేసి వేసుకొని ముద్దగా అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. తరువాత గిన్నె దించి మిక్సీలో, రోట్లో పచ్చడి చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం పెద్ద గిన్నె ఒకటి పొయ్యి మీద పెట్టుకొని దానిలో మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక రెండు బిర్యానీ ఆకులు, నాలుగు యాలకులు, నాలుగు లంగాలు, ఒక స్టార్ పువ్వు, ఇంచు దాల్చిన చెక్క వేసి కొంచెం వేగనియ్యాలి వెంటనే మూడు
ఉల్లిపాయలను కుట్ర చేసి దానిలో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు వేయించుకోవాలి. తరువాత రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకొని పచ్చి వాసం పొయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత నానబెట్టిన చికెన్ దాంట్లో వేసుకొని సన్న మంట మీద పావు గంట సేపు గిన్నె మూతపెట్టి ఉడికించుకోవాలి. తరువాత 85% ఉడికిన చికెన్ లో మనం ముందే నూరి పెట్టుకున్న గోంగూరను దానిలో వేసుకొని ముక్కలకు పెట్టె విధంగా కలుపుకొని ఐదు నిముషాలు ఆలా ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం నీళ్లు బాగా కాగబెట్టి నాలుగు యాలకులు, నాలుగు లంగాలు, ఒక స్టార్ పువ్వు, ఇంచు దాల్చిన చెక్క, అర టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. బాగా మరిగిన నీళ్లలో నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 75% ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ ని తారు చేసుకున్న గోంగూర చికెన్ మీద సమానంగా వేసుకొని దాని మీద మూడు స్పూన్ల నెయ్యి, కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్ లో ఐదు నిముషాలు, లో ఫ్లేమ్ లో 10 నిముషాలు ఉండనిస్తే ఘుమ ఘుమలాడే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ…

Leave a Reply